జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Training Secretariat staff

Training Secretariat Staff : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జి. పెనుమూరు. (త్రినేత్రం న్యూస్ )జూన్ 8. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని, యోగాంధ్ర ప్రిపరేషన్ లో భాగంగా సచివాలయ స్థాయిలో శిక్షణ ఇచ్చుటకు, శిక్షకులను ఎంపిక చేసి వారికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెనుమూరు నందు ఎంపిక చేసిన మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇప్పించడం జరిగింది.

ఈ శిక్షణ కార్యక్రమం ఐదు రోజులపాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణకు మాస్టర్ ట్రైనర్లుగా అన్ని ఉన్నత పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు వ్యవహరించారు. ఈ శిక్షణ ఉదయం 6.30 గంటల నుండి 7.45 గంటల వరకు నిర్వహించారు.ఈ శిక్షణా కార్యక్రమంలో ఎంపీడీవో నీలకంఠేశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో ఢిల్లీ బాబు, PDO లు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో మాస్టర్ ట్రైనర్లుగా పి. లోకనాథరెడ్డి, పి చంద్రశేఖర్, కే హేమలత, కే దీప, కే రజిని పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page