
నీళ్లు, నిధులు,నియామకాల్లో మావాటా మాకు కావాలంటూ కొట్లాడిన తెలంగాణ సబ్బండ వర్గాల ఆకాంక్ష నేరవేరిన రోజు
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు సాకారమైన సుదినం జూన్ 2వ తేదీ
60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఉద్యమ ఆశలు,అమరవీరుల ఆశయాలు నెరవేరిన రోజు
దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన రోజు
రాష్ట్ర సాధనలో అమరులైన వీరులకు సలాం…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేవరకొండ పట్టణంలో జాతీయ పతాకాన్ని, పార్టీ జెండాను ఆవిష్కరించిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
Telangana Formation Day : దేవరకొండ డివిజన్ జూన్ 02, త్రినేత్రం న్యూస్. సబ్బండ వర్గాలు ఏకమై గర్జించి, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేవరకొండ పట్టణంలో జాతీయ పతాకాన్ని, పార్టీ జెండాను బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు……కేసీఆర్ ఉద్యమ నాయకత్వం, సబ్బండ వర్గాల పోరాటం కలిసి తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకున్నది అని ఆయన తెలిపారు.సాధించుకున్న రాష్ట్రాన్ని పదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నాం. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో దేశానికే ఆదర్శంగా మారిందని ఆయన అన్నారు.అమరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటూ, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలి ఆయన కోరారు.దేశందశాబ్దాల కాలపు కొట్లాటకు,నాలుగు కోట్ల ప్రజల తండ్లాటకు విముక్తి లభించిన రోజు నేడు అని అన్నారు.శాంతియుతంగా పార్లమెంటరీ పంథాలో కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించి, ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఆగమైన తెలంగాణను స్వయం పాలనలో అభివృద్ధి చేసిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అన్నారు.
సకల జనుల సంక్షేమాన్ని కొనసాగిస్తూ, సమస్త రంగాల్లో ప్రగతిని సాధిస్తూ, పదేండ్ల అనతికాలంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా పాలన సాగించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన గుర్తు చేశారు.అన్ని వర్గాల ప్రజల జీవన విధానం మరింత గుణాత్మకంగా సాగే దిశగా పాలనా ప్రాధాన్యతలను ఎంచుకొని అమలు చేయాలి అని ప్రభుత్వాన్ని కోరారు.ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం నింపాలని అని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ మరింత ప్రగతిని సాధిస్తూ, పాడి పంటలతో వర్థిల్లుతూ, రైతులు సబ్బండ కులాలు, సకలజనుల జీవితాలు సుఖ సంతోషాలతో నిండాలీ అని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్,బిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు రాజీనేని వెంకటేశ్వర్ రావు,మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య,మాజీ జడ్పీటీసీ బోయపల్లి శ్రీనివాస్ గౌడ్,మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్,మాజీ రైతు బంధు అధ్యక్షులు ఉజ్జిని విద్యాసాగర్ రావు,మాజీ PACS చైర్మన్ ముక్కమల్ల బాలయ్య, బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు, బిఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నీల రవికుమార్, మాధవ రావు,కౌన్సిలర్లు పొట్ట మధు,పొట్ట మురళి, మాజీ వైస్ ఎంపీపీ అరెకంటి రాములు, కార్మిక విభాగం నాయకులు మహమ్మద్ జనీబాబ, మాకం చంద్రమౌళి,మాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి,తోటకూరి పరమేష్,పులిజాల జానీ, గిరామోని శ్రీను,sk.జమీర్ బాబా,రవీందర్ రావు,యాదగిరి రావు,వడత్య బాలు,మాడెం రాములు, వాజిద్ పాషా,గుండాల వెంకట్,నేనావత్ నాగార్జున, పగిడిమర్రి సతీష్,పగిడిమర్రి నాగరాజు, సూరి,సైదులు,సురేష్, వెంకట్,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
