Pension Distribution : పండుగ వాతావరణంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం

TRINETHRAM NEWS
Pension distribution program

లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు

Pension Distribution : త్రినేత్రం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి సారిగా వృద్దులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు అందించిన ఘనత అన్న నందమూరి తారక రామరావు మొదలుపెడితే నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4000 రూపాయలకు పెంచి అందిస్తున్నారని అందులోను మన కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా 36504 పింఛన్లు ఉండగా 16.07 కోట్లు అందిస్తున్నామని, లక్ష్మంపల్లి పంచాయతీలో 535 పింఛన్లు ఉండగా 23.77 లక్షలు అందిస్తున్నామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు..

శెట్టూరు మండలం యరబోరెపల్లి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు విచ్చేయగా గ్రామస్థులు, టీడీపీ నాయకులు పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు..నేడు దేశంలోనే అత్యధికంగా పింఛన్లు అందిస్తున్నది మన రాష్ట్రమేనని రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండుగ జరుగుతోందని అందులోను ముఖ్యమంత్రి సూచనలతో పింఛన్లు పంపిణీలో పాల్గొనడం నా అదృష్టమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top