MLA Dr Kalvakuntla Sanjay : కరాటే విద్యార్థులకు బెల్ట్స్ ప్రదానం చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

TRINETHRAM NEWS
MLA Dr. Kalvakuntla Sanjay presented belts

MLA Dr Kalvakuntla Sanjay : త్రినేత్రం న్యూస్ : కోరుట్ల పట్టణంలోని జీజీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలోని కరాటే బెల్ట్ ప్రదానోత్సవ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు బెల్ట్స్ ప్రదానం చేసి అభినందనలు తెలిపారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలను పెంపొందిస్తాయని అన్నారు. ప్రస్తుత కాలంలో ప్రతి విద్యార్థి చదువుతో పాటు శారీరక దృఢత్వం, స్వీయ రక్షణ నైపుణ్యాలను కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కరాటేలో శిక్షణ పొంది తదుపరి స్థాయికి చేరుకున్న విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రతిభ కనబర్చి కోరుట్లకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.. యువత క్రీడలు, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆసక్తి పెంచుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top