
మండల వ్యవసాయ అధికారి;– రెహానా.
Rice Stubble : డిండి (గుండ్ల పల్లి) మే 14, త్రినేత్రం న్యూస్. వరి కోతల అనంతరం కోయలను పొలాల్లో కాల్చడం వలన భూసారం దెబ్బతినడంతో పాటు పర్యావరణానికి హానికరమని, ప్రజారోగ్యానికి కూడా ప్రమాదమని డిండి మండల వ్యవసాయ అధికారి రెహానా తెలిపారు.
రైతులు వరికోతల తర్వాత … కోయలనుకాల్చితే నష్టం.. వరి కోయలను కాల్చితే నేలలోని సేంద్రీయ పదార్థాలు, పోషకాలు నశిస్తాయి. నేలలో ఉండే వానపాములు, సూక్ష్మజీవులు చనిపోతాయి. వాయు కాలుష్యం పెరిగి కార్బన్ ఉద్గారాలు వాతావరణ మార్పులకు దారితీస్తాయి. వెలువడే పొగ వల్ల శ్వాస సమస్యలు, దగ్గు, కంటి మండడం, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
అంతేకాకుండా పొలంలో గాలి ప్రసరణ, నీటి చొరబాటు తగ్గి తదుపరి పంట దిగుబడి పడిపోతుంది. భూమి గట్టిపడి నీరు నిల్వ సామర్థ్యం తగ్గి, చేదుగా మారుతుందనీ అన్నారు.. కోతల తర్వాత వరి కోయలను కాల్చకుండా పొలంలోనే ఉంచాలని వ్యవసాయ శాఖ సూచించింది. స్ట్రా చాపర్ లేదా శ్రెడర్ యంత్రంతో అవశేషాలను చిన్న ముక్కలుగా చేయాలి. పొలంలో నీరు పెట్టి ట్రాక్టర్ రోటావేటర్‌తో 25 రోజుల్లో రెండుసార్లు దమ్ము చేస్తే వరి కాడలు పాడై పంటకు సేంద్రియ కార్బన్ అందుతుందని, తద్వారా వరి నాణ్యత మెరుగవుతుందనీ పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

