Will Bring the Funds : నిధులు నేను తెస్తా, ప్రజారోగ్యం మీ పరిరక్షణ

TRINETHRAM NEWS
Will Bring the Funds

Will Bring the Funds : ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : మే 12: జిల్లా కేంద్రమైన విజయవాడ ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో వివిధ విభాగాలకు అవసరమైనటువంటి బయో మెడికల్ పరికరాలు లేవు. అందువల్ల రోగులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిజిహెచ్ సూపర్డెంట్ విజయవాడ పార్లమెంట్ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)కి గత కొద్ది రోజుల క్రితం లేఖ రాయడం జరిగింది. ఎంపీ స్పందిస్తూ సి ఎస్ఆర్ఎఫ్ ఫండ్స్ కింద అవసరమైన పరికరాలు అందించాలని బీడీఎల్ యాజమాన్యం కు లేఖ రాశారు.

అయితే వాళ్లు స్పందిస్తూ , ఆ యాజమాన్యం రూపాయలు యాబై లక్షలు మంజూరు చేస్తూ, నాలుగు ఇంటి లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఆ సహకారానికి చిన్ని కృతజ్ఞతలు తెలిపారు.

తాను లేఖ రాసిన వెంటనే స్పందించిన బీడీఎల్ యాజమాన్యానికి ఎంపీ చిన్ని కృతజ్ఞతలు తెలిపారు సి ఎస్ ఆర్ ఫండ్స్ కింద కానీ దాతల సహకారంతో కానీ ఇంకా అనేక రకాలుగా నిధులు తేవడానికి సిద్ధంగా ఉన్నామని రాబోయే ఐదు ఆరు నెలల్లో మరింత ఎక్విప్మెంట్ ఆ వైద్యశాలకు రాబోతుందని అన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలన్నిటిని మంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లాలని త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ మరియు అధికారులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top