
Nandi Awards : ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఏప్రిల్ 07; జిల్లా కేంద్రమైన విజయవాడ పార్లమెంట్ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మీడియాతో మాట్లాడుతూ , సినీ పరిశ్రమను ఎంతో గౌరవిస్తున్నామని ఆయన అన్నారు. త్వరలోనే నంది అవార్డులు ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్రంలో స్టూడియోలు నిర్మాణానికి సహకరిస్తామని పేర్కొన్నారు.
అవసరమైనప్పుడు ఇండస్ట్రీతో చర్చిస్తామని , మెగాస్టార్ చిరంజీవి చొరవ చూపాలని ఆశించారు. టాలీవుడ్ కు అరవై ఐదు శాతం ఆదాయం వచ్చే ఈ రాష్ట్రంలో కనీసం ఇరవై ఐదు శాతం షూటింగ్ జరిపితే బాగుంటుందన్నారు. అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయని స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

