CI Allu : ఆటోడ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించిన సిఐ అల్లు

TRINETHRAM NEWS
CI Allu organized an awareness conference for auto drivers

CI Allu : త్రినేత్రం న్యూస్, కడియం మండలంలోని మురమండ గ్రామంలో బస్టాండ్ వద్ద ఉన్న అభయ ఆంజనేయ ఆటో యూనియన్ సభ్యులకు శుక్రవారం సాయంత్రం కడియం సిఐ అల్లు వెంకటేశ్వరరావు ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
సి.ఐ వెంకటేశ్వరావు, మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడిపితే జరినామా తో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని అన్నారు. మారిన మోటార్ వాహనాల చట్టం ప్రకారం కఠిన శిక్షలు భారీ జరినామాలతో ఉన్నాయని డ్రైవర్లు ఎల్లప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించాలని, వాహనానికి సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని
సూచించారు. ఎస్సై నాగ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ పరిమితికి మించి వాహనం లో ప్రయాణికులను ఎక్కించుకోకూడదని ఏదైనా ప్రమాదం జరిగితే బాధితులు డ్రైవర్ పైనే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రమాద బాధ్యత డ్రైవరే వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. డ్రైవరు ఎల్లప్పుడు మోటార్ వాహనాలు చట్టం నిబంధనలను తప్పక పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ యర్రంశెట్టి వీరబాబు, బొప్పన లోవరాజు, బూరా సత్యనారాయణ ఎఎస్ఐ చుక్కల వెంకటరమణ, పోలీసు సిబ్బంది, ఆటో యూనియన్ సభ్యులు, ఈ సమావేశంలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top