
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.
Ramavat Ravindra Kumar : చందంపేట ఏప్రిల్ 02, త్రినేత్రం న్యూస్. చందంపేట మండలం గన్నెర్లపల్లి గెట్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న శ్రీసాయి కాటన్ ఇండస్ట్రియల్ నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మారుమూల ప్రాంతంలో కాటన్ మిల్ ఏర్పాటు చేయడం అభినందనీయం అని ఆయన అన్నారు. పత్తి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు టీ వీఎన్ రెడ్డి , కేతావత్ శంకర్ నాయక్, బొడ్డుపల్లి కృష్ణ తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

