
Gandhamotsava Program : త్రినేత్రం న్యూస్ :మార్చ్ 28: నెల్లూరు జిల్లా :అల్లూరు… ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట క్రిష్ణారెడ్డి , పాల్గొన్నారు. దర్గా వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, మత పెద్దలచే ప్రత్యేక ఆశీర్వాదం పొందారు. హిందూ, ముస్లిం సౌభ్రాతృత్వానికి ప్రతీకగా గంధమోత్సవాన్ని నిర్వహించడం విశేషంగా నిలిచింది.
అన్ని మతాల ప్రజలు ఐక్యంగా పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు శాంతి, సౌహార్దతను కాపాడాలని పిలుపునిచ్చారు. సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగలను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. పెద్ద ఎత్తున భక్తులు, స్థానిక నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

