
Jale Narasimha Reddy : దేవరకొండ డివిజన్ మార్చ్ 28, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని ఎం కే ఆర్ మునగాల కొండలు రావు డిగ్రీ కళాశాలలో జరిగిన సీనియర్ విద్యార్థుల ఫేర్ వెల్ పార్టీ వీడ్కోలు సమావేశ పార్టీలో ముఖ్య అతిథిగా జాలే నరసింహారెడ్డి పాల్గొని సీనియర్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఫేర్ వెల్ పార్టీ అనేది కళాశాల జీవితంలోని తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సీనియర్లకు జూనియర్లు మరియు అధ్యాపకులు వీడ్కోలు పలికే ఒక చిరస్మరణీయ వేడుక అన్నారు.. అదే విధంగా ఈ వేడుక విద్యార్థుల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తూ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి ప్రతీ ఒక్కరూ ఉన్నతమైన స్థాయిలో ఉండాలని కోరుకుంటూ.. వారి బంగారు భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో ఎం కె ఆర్ కళాశాల ప్రిన్సిపాల్, వై స్ ప్రిన్సిపాల్, మరియు కళాశాల అధ్యాపకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

