MLA Nenavat Balu Naik : బంజార భవన్ ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన

TRINETHRAM NEWS
MLA Nenavat Balu Naik Foundation stone

MLA Nenavat Balu Naik : కొండ మల్లేపల్లి మార్చ్ 27, త్రినేత్రం న్యూస్. కొండమల్లెపల్లి పట్టణ కేంద్రంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న బంజార భవన్ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… బంజార సమాజానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బంజార భవన్ నిర్మాణం ద్వారా బంజార సమాజానికి చెందిన ప్రజలకు సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుకూల వేదికగ మారనున్నదని పేర్కొన్నారు.

దేవరకొండ నియోజకవర్గంలో అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రత్యేకంగా గిరిజన మరియు పేద వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.

ప్రజల అవసరాలను గుర్తించి తగిన మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా సమగ్ర అభివృద్ధిని సాధించడమే లక్ష్యమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆలంపల్లి నర్సింహ, వడ్త్య దేవేందర్ నాయక్, టీపీసీసీ మెంబర్ మరియు పీఏసీఎస్ చైర్మన్ డా. వేణుందర్ రెడ్డి, పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షుడు డా. వేమన్ రెడ్డి, బంజార సంఘం అధ్యక్షుడు లాలు నాయక్, కార్యదర్శి సురేష్ నాయక్, బంజార నాయకులు, ప్రజా ప్రతినిధులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top