
Free Electricity : శ్రీ సత్య సాయి జిల్లా : మార్చి 23: (త్రినేత్రం న్యూస్): పెనుగొండ నియోజకవర్గం శాసన సభ్యురాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి సంజీవరెడ్డి సవిత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేనేత, మరమగ్గ కార్మికుల కోసం కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. వచ్చే నెల అనగా ఏప్రిల్ ఒకటి వ తేదీ నుంచి సంబంధించిన కార్మికులకు రెండు వంద ల యూనిట్లు, పవర్ లూమ్ కార్మికులకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఆమె తెలిపింది.
ఈ పథకం ద్వారా కార్మికుల ఆర్థిక భారం తగ్గించి, చేనేత రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పింఛన్ లు, సబ్సిడీలు, మార్కెటింగ్ సౌకర్యాలతో చేనేతలకు మద్దతిస్తోందని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి సూపర్ సిక్స్ పథకాలు అందించిందని గుర్తు చేశారు. ప్రజలందరూ ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని సంతోషాన్ని వ్యక్తపరిచారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

