AMC Director Pawan Kumar : ఏఎంసీ డైరెక్టర్ పవన్ కుమార్ ఆర్యవైశ్యలు ను, ఇద్దరు వ్యక్తులు కొట్టి గాయపరిచారు

TRINETHRAM NEWS
AMC Director Pawan Kumar Arya Vaishyalu

AMC Director Pawan Kumar : త్రినేత్రం న్యూస్:మార్చి 22: నెల్లూరు జిల్లా :కావలి… కావలి పట్టణంలో ఆదివారం సాయంత్రం జరిగిన దారుణ సంఘటన తుమ్మలపెంట రోడ్డు లోని ఒక దాబా దగ్గర తెలుగుదేశం పార్టీ కావలి ఏఎంసి డైరెక్టర్ పవన్ కుమార్ ఆర్యవైశ్యులు ను ఇద్దరు వ్యక్తులు అత్యంత దారుణంగా కిందపడేసి కాళ్లతో చేతులతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు.

ఈ హత్యా ప్రయత్నం సంఘటనతో కావలి తెలుగుదేశం పార్టీలో ఏ స్థాయిలో తీవ్ర విభేదాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని పలువురు కావలి పట్టణవాసులు చర్చించుకుంటున్నారు ఏదైనా సమస్య ఉంటే కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోవాల్సింది పోయి ఈ విధంగా రౌడీయిజం చేయడం భయభ్రాంతులకు గురి చేయటం చాలా బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఈ విషయంను తీవ్రంగా పరిగణలోకి తీసుకొని నిందితులను తీవ్రంగా శిక్షించాలని శాంతి భద్రతలను కాపాడాలని రౌడీయిజాన్ని అణిచివేయాలని కావలి నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top