MLA Lays Foundation Stone : ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS
MLA lays foundation stone

అందరికీ చేరువలో నాణ్యమైన వైద్య సేవలు

దాతలు కృష్ణ కుమార్ దంపతులు అరుదైన వ్యక్తులు

కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి వెల్లడి

MLA Lays Foundation Stone : అందరికీ చేరువలో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి తెలిపారు. బోగోలు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం సమీపంలో దాతలు బచ్చు కృష్ణకుమార్ – సంధ్య దంపతుల సహకారంతో డాక్టర్ బచ్చు అమర నూతన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించగా, కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఈ నూతన వైద్యశాల కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మరి కొన్ని సేవలు ఈ ఆరోగ్యం కేంద్రంలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. హైవే కి పక్కనే ఈ హాస్పిటల్ ఉండటం వలన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. దాతలు బచ్చు కృష్ణకుమార్ – సంధ్య దంపతుల సేవాభావాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రశంసించారు. సమాజానికి సేవ చేయాలనే తపనతో ముందుకు రావడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. వ్యక్తి జీవితంలో ప్రొఫెషనల్, కుటుంబ, సామాజిక మరియు ఆధ్యాత్మిక లక్ష్యాలలో సమతౌల్యం సాధించడం ద్వారా సమాజంలో ఆదర్శంగా నిలవవచ్చన్నారు. బచ్చు కృష్ణకుమార్ దంపతులు ఈ నాలుగు రంగాల్లోనూ విజయాన్ని సాధించిన అరుదైన వ్యక్తులని కొనియాడారు. ఇక బోగోలు మండలం ఒకప్పుడు జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చిన ప్రాంతమని, ప్రస్తుతం వెనుకబడిన పరిస్థితి నుంచి బయటపడేందుకు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీద జ్యోతి, టీడీపీ బోగోలు మండల అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి లేళ్లపల్లి సుధీర్, చిలకపాటి వెంకటేశ్వర్లు, కండ్లగుంట మధుబాబు నాయుడు, దాతలు బచ్చు కృష్ణ కుమార్, సంధ్య, శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో అరవ రాధాకృష్ణ, కుంచాల తిరుమలేష్, లక్కాకుల మాధవరావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top