Free Bus Travel : దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం

TRINETHRAM NEWS
Free bus travel for the disabled

Free Bus Travel : పశ్చిమగోదావరి జిల్లా : మార్చి 18: (త్రినేత్రం న్యూస్); పాలకొల్లు ప్రయాణికుల బస్సు ప్రాంగణంలో దివ్యాంగ శక్తి పథకాన్ని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు ప్రారంభించారు. నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవాళ్లకి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని , అదేవిధంగా వాళ్లు బస్సు డిపోల్లో సంబంధిత సర్టిఫికెట్ చూపించి, బస్సు పాస్ ల ను పొందాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దివ్యాంగులు మరియు ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top