
పంచ సూత్రాలతో వ్యవసాయం పండగ
కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు మేలు…
Raithanna Meekosam : త్రినేత్రం న్యూస్ : రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, పంచ సూత్రాలతో వ్యవసాయం పండగలా మారుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. కొత్తపేట మండలం పలివెల సేరిపాలెంలో జరిగిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతన్నా మీకోసం కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందన్నారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20వేలను మూడు దఫాలుగా రైతుల ఖాతాల్లో జమ చేసామని తెలియజేశారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో పంచ సూత్రాలతో రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నామని తెలిపారు. నీటి భద్రత కింద ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో పోలవరం వెలిగొండ తదితర ప్రాజెక్టులు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
అగ్రిటెక్ లో భాగంగా ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు, డ్రోన్లు మొదలైనవి సబ్సిడీపై అందిస్తుందన్నారు. డిమాండ్ ఆధారిత పంటల సాగుపై రైతులు ఆ అవగాహన పెంచుకోవాలన్నారు.ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, వ్యవసాయధారిత పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేస్తుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా పేరుతో రైతులను నిలువునా మోసం చేశారన్నారు. ఏడాదికి రూ.7500 మాత్రమే రైతుల ఖాతాలో జమ చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చెప్పింది చెప్పినట్లుగా రూ.20 వేలను పీఎం కిసాన్ పథకంతో కలిపి రైతుల ఖాతాలో జమ చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం సేకరణ నగదు రైతులకు జమ కావడానికి ఆరు నెలల వరకు సమయం పట్టేది అన్నారు. ఇప్పుడు ధాన్యం అమ్మిన వెంటనే 24 గంటల్లో రైతులు ఖాతాలో నగదు జమవుతుందన్నారు. ఈ విధంగా అన్నదాతల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

