
Class 10th Exams : ఎన్టీఆర్ జిల్లా : మార్చి 16: (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా పరిషత్ హై స్కూల్ లో నూట తొంభై ఆరు మంది విద్యార్థులకు నూట తొంభై నాలుగు మంది హాజరయ్యారు . పకడ్బందీగా పరీక్షలు జరిగాయి. ఉదయం సమయం తొమ్మిది గంటల నుండి లోపలకి చెక్ చేసి విద్యార్థులను లోపటికి పంపించారు. మొత్తం రూములు తొమ్మిది , అదేవిధంగా పరీక్షలు నిర్వహించిన సంబంధిత అధికారులు అనగా ఉపాధ్యాయులు పది మంది. అని ఇంటర్వ్యూలో భాగంగా ప్రధానోపాధ్యాయురాలు ఆర్ శోభారాణి తెలిపారు.

