Medical Officers : వైద్యాధికారులు డాక్టర్. అనురాధ మరియు డాక్టర్. రేవతి ఇద్దరికీ వినతి ఇచ్చన ఎన్ హెచ్ ఎం జనగాం జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్

TRINETHRAM NEWS
Medical Officers Dr. Anuradha and Dr. Revathi were requested

Medical Officers : త్రినేత్రం న్యూస్ జనగాం జిల్లా ప్రతినిధి… ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఉద్యోగులందరికీ రావలసిన 5 నెలలు పెండింగ్ వేతనాలు రాక ఉద్యోగులు చాలా ఇబ్బందికరంగా మారింది ఆవేదన వ్యక్తం చేసిన ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) జనగాం జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ .. ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ ప్రతి నెల 5 వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని, వేతనాల లేక ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారని ముఖ్యంగా ఇంటి కిరాయి, కరెంట్ బిల్లు, పాల బిల్లు, పిల్లల బడి ఫీజులు, ఈ.ఏం.ఐ.లు కట్టలేని దీన పరిస్థితిలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు ఉన్నారని ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేశారు.

కాబట్టి ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు రావలసిన 5 నెలలు వేతనాలు అనగా సెప్టెంబర్, అక్టోబర్ ,నవంబర్, డిసెంబర్ మరియు జనవరి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనురాధ, డాక్టర్ రేవతి వినతి పత్రం అందజేశారు. ఈనెల 16 మార్చ్ 2026 లోపు వేతనాలు చెల్లించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం చెల్లించలేని పక్షాన 17వ తేదీ నుంచి లంచ్ సమయంలో నల్ల రిబ్బను ధరించి నిరసన వ్యక్తం చేస్తామని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాఫ్ నర్స్ లావణ్య, ఎన్ సి డి రాజకుమారి, ఏ.ఎన్.ఎం.లు అనిత , మంగ, స్వప్న , ఉపేంద్ర, మణెమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ జ్యోతి, కాంటిజెంట్ వర్కర్లు నరేష్ కవిత మరియు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top