పశ్చిమగోదావరి జిల్లా : మార్చి 14: (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణం సమీపంలో ఉన్నటువంటి మండల కేంద్రమైన ఉండి లో జనసేన పార్టీ పదమూడు వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయం చైర్మన్, ఉండి నియోజకవర్గం ఆ పార్టీ ఇన్ చార్జ్ బత్తిన నాగరాజు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి జనసేన సైనికుడికి తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని ఈ సందర్భంగా అన్నారు.


