Triple ITs : తెలంగాణ ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) ఆధ్వర్యంలోని బాసర, మహబూబ్‌నగర్‌ ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను ఆర్జీయూకేటీ బాసర వీసీ గోవర్దన్‌ శుక్రవారం విడుదల చేశారు. దీని ప్రకారం.. మార్చి 16న నోటిఫికేషన్‌, మార్చి 18 నుంచి మే 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది.

అర్హులైన అభ్యర్థులు టీజీఆన్‌లైన్‌ సెంటర్లు/మీసేవ/యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రొవిజినల్‌ జాబితాను మే 30న ప్రకటించి తొలి విడత కౌన్సెలింగ్‌ను జూన్‌ 5న నిర్వహించనున్నట్లు వీసీ తెలిపారు. ఈ షెడ్యూల్‌ విడుదల కార్యక్రమంలో ఓఎస్‌డీ ప్రొఫెసర్‌ ఈ. మురళీ దర్శన్‌, ప్రవేశాల కన్వీనర్‌ శీలం శేఖర్‌, కో-కన్వీనర్‌ బండి హరికృష్ణ, అసోసియేట్‌ డీన్‌లు డా.మహేష్‌, డా. విఠల్‌, డా.దేవరాజ్‌, సునీత తదితరులు పాల్గొన్నారు.

Schedule released for admissions in Telangana Triple ITs

You cannot copy content of this page

Scroll to Top