CPM : కొండాపూర్ కుర్ద్ గ్రామంలో పేదల భూమిలో అక్రమ కట్టడాలు వెంటనే ఆపాలి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్… సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ డిమాండ్..
వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం పరిధిలోని కొండాపూర్ కుర్ద్ గ్రామంలో పేద రైతుల భూములు సర్వే 62, 63 లో 4ఎకరాల 17కుంటాల ప్రభుత్వ పట్టా భూమి ఉంది. ఈ భూమిలో బలవంతంగా దౌర్జన్యంగా భూమిలో అక్రమ కట్టడాలు చేస్తున్నారు వెంటనే ఆపాలని హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన చెల్లదంటున అధికారులు. పెదాలపై దౌర్జన్యం చేస్తున్న మండల అధికారులు, గ్రామ సర్పంచి, పంచాయతీ కార్యదర్శి లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి జేసీ కి మెమొరాండం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ మాట్లాడుతూ అధికార పార్టీ సర్పంచికీ ఎన్నికలలో ఓట్లు వెయ్యలేదని కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారు. డెబ్బై ఏండ్ల పుచకుంట్ల వెంకటయ్య మెడకాయ తెగింది గాంధీ ఆస్పత్రికి చికిత్స పొందుతూ చావు బతుకులలోఉన్నారు. వెంకటయ్యా పై దాడి చేసిన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తికోవలన్నీ అక్రమ కట్టడాలు చేస్తున్న వారికి సహకరించిన కార్యదర్శి ఎంపీవో , తహసిల్దార్, si సర్పంచి ల పై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి కలెక్టర్ sp లకు అధికారులకు డిమాండ్ చేస్తున్నాము.
తక్షణమే అక్రమ కట్టడాలు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తాము. లేనిచో కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన పోరాటాలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో కొండాపూర్ కార్డు బాధితులు ప్రసాద్ కుమార్ చంద్రమ్మ రాములు చంద్రయ్య హనుమంతు నర్సింలు శాంతమ్మ రంగయ్య నర్సమ్మ మమత కుమారు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Illegal constructions on poor people's land

You cannot copy content of this page

Scroll to Top