Health Warnings : ఆరోగ్య హెచ్చరికలు
పశ్చిమగోదావరి జిల్లా : మార్చి 11: (త్రినేత్రం న్యూస్): జిల్లా కేంద్రమైన భీమవరంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఒక సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ తహసిల్దారు నాగార్జున మాట్లాడుతూ బీడీ, సిగరెట్, చుట్ట వంటి పొగాకు ఉత్పత్తుల వల్ల గుండె ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు వస్తాయని హెచ్చరించారు. అయితే అల్లు శ్రీనివాస్ పొగాకు ఉత్పత్తులను పూర్తిగా అరికట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చాన్ పాషా, శివాజీ వర్మ, జయరాజు, వెంకటేశ్వరరావు, రీజ నాల్డ్, విజయ్ వర్మ, రంగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


