సామజికంగా, ఆర్థికంగా మహిళలు ఎదిగినప్పుడే సమాజం బాగుంటుంది.
విద్యా, ఉద్యోగ రంగాలలో ఆడపిల్లలే ముందు వరుసలో నిలుస్తున్నారు.. ఎం ఎల్ ఏ నేనావత్ బాలు నాయక్.
దేవరకొండ డివిజన్ మార్చ్ 10, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సతీసమేతంగా కలిసి పాల్గొని, రిటైర్డ్ మహిళా ఉద్యోగుల ను శాలువాతో సత్కారించి, శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్* .వారి సతీమణి శ్రీమతి జ్యోతి ప్రసన్న బాలు నాయక్ .
ఏ దేశంలో అయితే మహిళలకు సమానత్వం, సాధికారత లభిస్తుందో ఆ దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రిటైర్డ్ ఉద్యోగుల మహిళా మణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఏ సమాజంలో అయితే మహిళలు సామజికంగా, ఆర్థికంగా ముందడుగు వేస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందుంతుందని అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మహిళలను గౌరవించాలని అనేక పోరాటాలు జరిగాయాని తెలిపారు. మన దేశంలో సావిత్రి భాయి పూలె, రాష్ట్రంలో దుర్గా భాయ్ దేశ్ ముఖ్ వంటి వారు మహిళలు బాలికల విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేశారని వెల్లడించారు. కాకతీయ రాజులకు ఎదురు తిరిగిన వీరవనితలు సమ్మక్క, సారలమ్మ లను స్పూర్తిగా తీసుకోవాలని, తన భూమిని కాపాడుకోవడం కోసం భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
మహిళలకు అవకాశం ఇస్తే ఏదైనా సాధిస్తారని అన్నారు. మహిళా సాధికారతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని తెలిపారు. రాష్ట్రంలో అమలయ్యే అన్ని సంక్షేమ పథకాలు మహిళల పేరుమీదనే ఉన్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ అరుణ సురేష్ గౌడ్, రిటైర్డ్ ఉద్యోగుల అధ్యక్షులు టీ.నర్సింహా, కార్యదర్శి చంద్రమౌళి,రిటైర్డ్ ఉద్యోగులు, మహిళామణులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


