Chigullapalli Ramesh Kumar : సృష్టికి మూలం అమ్మ

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి… మహిళా దినోత్సవం వేడుకలలో పాల్గొన్న చిగుళ్లపల్లి రమేష్ కుమార్

నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరని.. మరి ముఖ్యంగా ఈ సృష్టికి మూలం అమ్మ అని వికారాబాద్ మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ అన్నారు.

ఈరోజు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక.. కార్యక్రమంలో భాగంగా 18వ వార్డు పరిధిలోని కేజీబివి రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిగుళ్లపల్లి రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ.. నేడు మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా ముందుకు వెళ్తున్నారని కొనియాడారు.

మహిళలు అనుకుంటే సాధించనిధి అంటూ ఏదీ లేదని అన్నారు. అందుకు ఉదాహరణ మన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య. ఆమె మన వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అలాగే పాఠశాల విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ.. జీవితంలో గెలుపు ఓటములు సహజం.. కావున ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా మీరు అనుకున్న గోల్ ను రీచ్ అవ్వడానికి అహర్నిశలు కృషి చేస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ హాస్టల్లో నీటి సమస్య ఉందని రమేష్ కుమార్ దృష్టికి తీసుకురావడంతో.. ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి మరియు స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో వికారాబాద్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్, మహిళ ఉపాధ్యాయులతో పాటు మహిళా పారిశుద్ధ్య కార్మికులను శాలువాతో సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ నరసింహారెడ్డి, మెప్మా వెంకటేష్, వార్డు ఆఫీసర్ సాయి, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mother is the source of creation

You cannot copy content of this page

Scroll to Top