జూన్ 26, 2026
TRINETHRAM NEWS

అమ్మవారిని దర్శించుకున్న గిరిజాల బాబు దంపతులు

త్రినేత్రం న్యూస్, ఫిబ్రవరి 12, కడియం పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ కడియాలమ్మ అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రూరల్ మాజీ కోఆర్డినేటర్ గిరజాల బాబు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచ్, ది ఆర్యాపురం అర్బన్ బ్యాంకు మాజీ చైర్‌పర్సన్ శ్రీమతి గిరజాల రామకృష్ణ తులసి, కడియం జనార్ధన స్వామి ఆలయం మాజీ చైర్మన్ బండారు లక్ష్మి శ్రీనివాస్ దంపతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దంగుడు బియ్యం సుబ్బారావు దంపతులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని నాయకులు కోరుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Sri Sri Kadiyalamma Ammavari Jayanti celebrations

You cannot copy content of this page