ఎంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ అయినా మహా అయితే రూ.రెండు లక్షలకు మించి ఉండదు

TRINETHRAM NEWS

Trinethram News : ఎంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ అయినా మహా అయితే రూ.రెండు లక్షలకు మించి ఉండదు. కానీ మీ స్మార్ట్‌ఫోన్‌ ఎలాంటిదైనా నెల రోజులపాటు ముట్టుకోకుండా ఉంటే రూ.8లక్షలు ఇస్తామంటోంది ఓ కంపెనీ. చాలామంది అమెరికన్లు ఈ పనిలోనే ఉన్నారు. స్మార్ట్‌ఫోన్‌ అతి వాడకంతో పిల్లల చదువు పాడవుతోంది.. యువత చెడుదారి పడుతున్నారు అని చాలామంది అనుకుంటారు. అమెరికాకు చెందిన ‘సిగ్గీస్‌ డైరీ’ అనే కంపెనీదీ ఇదే అభిప్రాయం.

అక్కడి కుర్రకారుని కొద్దిరోజులైనా స్మార్ట్‌ఫోన్లకు దూరం చేయడానికి ఓ కార్యక్రమం చేపట్టింది. దాంట్లో భాగంగానే స్మార్ట్‌ఫోన్‌ని ముప్ఫై రోజులు వాడకుండా ఉన్నవారికి రూ.8లక్షలు ఇస్తానని ప్రకటించింది. దీనికోసం ముందు కంపెనీ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలి. డిజిటల్‌ డిటాక్స్‌ అవసరం తెలియజేస్తూ ఓ వ్యాసం రాయాలి. పోటీకి ఎంపికైన వారికి ఓ కీప్యాడ్‌ ఫోన్‌, సిమ్‌ వాళ్లే ఇస్తారు. స్మార్ట్‌ఫోన్‌ని పక్కనపెట్టి దాన్ని మాత్రమే ఉపయోగించాలి. విజయవంతంగా నెలపాటు అలా చేసినవారికి ఆ మొత్తం అందిస్తామంటోంది కంపెనీ. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తైంది. త్వరలోనే పోటీ మొదలవుతుంది. ఇది ఆన్‌లైన్‌లో బాగా వైరల్‌ కావడంతో.. మాకూ ఇలాంటి అవకాశం వస్తే బాగుండు అంటున్నారు మనోళ్లు.

You cannot copy content of this page

Scroll to Top