Trinethram News : Feb 02, 2026, తెలంగాణ : తాను పారిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. అయితే తాను ఆదివాసీల అస్తిత్వం కోసం పరితపించే వ్యక్తిని కానీ పారిపోయే రకాన్ని కాదని సీతక్క స్పష్టం చేశారు.
మేడారం జాతర దిగ్విజయాన్ని జీర్ణించుకోలేక కొందరు చేసే కుట్రలకు తాను భయపడే రకం కాదన్నారు. జాతరను విజయవంతం చేసిన విధంగానే జాతర తర్వాత చేపట్టాల్సిన పనులను పూర్తి చేస్తున్నామని, ఐదువేలకు పైగా పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి మేడారాన్ని పరిశుభ్రపరుస్తున్నామని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


