Lorry Burnt Down : కాలిపోయిన లారీ.. ఒకరి మృతి

TRINETHRAM NEWS

ఏలూరు జిల్లా : జనవరి : ముప్పై ఒకటి ; (త్రినేత్రం న్యూస్ ); చింతలపూడి నియోజకవర్గం, కామవరపు కోట మండలం, తడికలపూడి సమీపంలో పామర్తి మల్లికార్జున అనే వ్యక్తి కొబ్బరికాయల కోతకు పద్దెనిమిది మంది కూలీలతో లారీలో కొబ్బరి తోటలోకి తీసుకెళ్లాడు.

కొబ్బరి బోండాలు కోస్తుండగా వేలాడుతున్నటువంటి విద్యుత్తు తీగలు కిందకు లారీకి తగిలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆ లారీపై కూర్చున్న మల్లికార్జున మంటల్లో చిక్కుకొని మృతి చెందాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడం జరిగింది. మరణించిన వ్యక్తి కొబ్బరికాయల అమ్మకంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A lorry burnt down

You cannot copy content of this page

Scroll to Top