Trinethram News : హైదరాబాద్ : జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. హైదరాబాద్ లంగర్ హౌజ్ లోని చారిత్రక బాపు ఘాట్ వద్ద శుక్రవారం ఉదయం ప్రత్యేక ప్రార్థనలు, నివాళి కార్యక్రమాలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బాపు ఘాట్‌ను సందర్శించారు. వీరితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత వి.
హనుమంతరావు, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఇతర ముఖ్య నాయకులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


