Ravindra Kumar : బీ ఆర్ ఎస్ పార్టీ దే విజయం

TRINETHRAM NEWS

మున్సిపాలిటీ ఎన్నికలలో బీ ఆర్ ఎస్ పార్టీ గెలుపు ఖాయం.

కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టు, బీ ఆర్ ఎస్ లో చేరికలు
రవీంద్ర కుమార్ మాజి శాసన సభ్యులు.

దేవరకొండ డివిజన్ జనవరి 28 త్రినేత్రం న్యూస్. దేవరకొండ ఖిల్లాపై గులాబీ జెండా ఎగరడం ఖాయం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు.

బుధవారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డుకు చెందిన మద్దిమడుగు సైదులు తోపాటు పలు కుటుంబాలు బిఆర్ ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు.పట్టణ ప్రాంతాల ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని, రెండు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఏ పట్టణానికి చెల్లించని ఏకైక ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు.కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలనలో పట్టణాల్లో పరిపాలన పూర్తిగా పడకేసిందని, పారిశుద్ధ్యం నుంచి ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

గత ప్రభుత్వం కేటాయించిన అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి శిలాఫలకాలు వేయడం తప్పించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని ఒక్కటి కూడా లేదన్నారు.ఒకవైపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెడుతూ మరోవైపు పట్టణాలను పడుకోబెట్టి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందన్నారు అని ఆయన అడిగారు.

ఈ రెండు సంవత్సరాల్లో ఆయా పట్టణాలకు చేసిన అభివృద్ధి, ఇచ్చిన నిధులు వివరించి ఓట్లు అడగాలని కాంగ్రెస్ నేతలకు ఆయన సవాల్ చేశారు.పంచాయతీరాజ్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను తట్టుకొని మంచి ఫలితాలు సాధించామని, అదే స్పూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.కలిసికట్టుగా పోరాడి ఎన్నికల్లో మంచి విజయం నమోదు చేయాలని పిలుపునిచ్చారు .

ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కాబట్టే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.రెండేళ్లలో కచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ దేవరకొండ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ పాల్వాయి స్రవంతి, కేతావత్ బిల్యా నాయక్, నేనావత్ కిషన్ నాయక్,గాజులఆంజనేయులు నీల రవికుమార్,వేములరాజు, రజియాసుల్తానా,ఇలియాస్ పటేల్,జానీబాబ,జాఫర్, ఆఫ్రోజ్,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BRS party's victory

You cannot copy content of this page

Scroll to Top