WhatsApp Image 2024 01 26 at 3.31.40 PM
Trinethram News తూర్పు గోదావరి జిల్లా..
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హోం మంత్రి వనిత
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు గణతంత్ర వేడుకల్లో హోంమంత్రి తానేటీ వనిత పాల్గొన్నారు
ఈ సందర్భముగా వనిత మాట్లాడుతూ రెండు వందలసంవత్సరాల
పరాయి పాలన భానిస సంకెళ్ళ నుంచి ఎందరో స్వాతంత్ర్య సమర యోధుల ప్రాణత్యాగాల ఫలితంగా మనదేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నామని ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని నిర్మించుకున్నామని ప్రతీ ఒక్కరూ రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండాలని నా సొంత గ్రామంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని వనిత అన్నారు.
