అల్లూరిజిల్లా అరకులోయ జనవరి 28, (త్రినేత్రంన్యూస్): అరకు చలి ఫెస్ట్ ఈనెల 29, 30, 31 ఫిబ్రవరి 1 వరకు నాలుగు రోజులపాటు కొనసాగనున్నట్టు అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఆయన మంగళవారం సాయంత్రం అరకులో విడుదల చేశారు.
ఈ సందర్భంగా స్థానిక మీడియాతో మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం అరకు “చలి ఫెస్టివల్ 2026” ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తుందని ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 29న అరకు ఫెస్ట్ ప్రారంభ కార్యక్రమానికి అరకులోయ వస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
అరకు టూరిజం అభివృద్ధికై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. 29 మధ్యాహ్నం రెండు 12 గంటలకు కొత్తవలస ఫామ్ లో హెలికాప్టర్ రానున్నట్లు తెలిపారు. అనంతరం రవ్వలగూడ డిగ్రీ కళాశాలలో కేరవాన్ టూరిజమ్ ను సి.యం ప్రారంభిస్తారని, అల్లూరు జిల్లాలో ఐదు ప్రాంతాల్లో ఈ టూరిజంను అభివృద్ధి పరుస్తున్నామని కలెక్టర్ అన్నారు. అడ్వాన్స్ టూరిజంకు చెందిన అన్ని ఈవెంట్లను సీఎం పరిశీలిస్తారు. పారా గ్రైండర్,పారా మోటరింగ్, స్కూబా డైవింగ్ వంటివి సి.యం చూస్తారు.
అరకు ప్రాంతంలో పండే అన్ని రకాల మిల్లెట్లు తో కూడిన డిషెష్లను “గల్లర్ ఇన్స్టిట్యూట్ తిరుపతి” సౌజన్యముతో నిర్వహించే ప్రత్యేక డెషెష్ ప్రదర్శన ను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. ప్రధాన వేదిక వద్ద వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన గిరిజన కళాకారుల నృత్య ప్రదర్శన కేజ్రీవాల్ లను ముఖ్యమంత్రి తిలకిస్తారు.
అనంతరం గిరిజనులను పర్యాటకుల ను ఉద్దేశించి ప్రసంగం, టూరిజం అభివృద్ధి చేస్తున్న డాక్యుమెంటరీని సీఎం చంద్రబాబు తిలకిస్తారు. చొంపి గ్రామంలో ఏర్పాటు చేసిన స్టే హోం నిర్వహణ అనుభవం పై అక్కడి వారితో ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా మాట్లాడంశతో ముఖ్యమంత్రి పర్యటన ముగిస్తుందని కలెక్టర్ దినేష్ అన్నారు.
30 తారీఖున గాలికొండ ప్యూ పాయింట్ కు పర్యాటకులను తీసుకువెళ్లి ట్రాకింగ్ స్టిల్స్ చూపిస్తామనీ, ఈ సంవత్సరం కూడా గత ఏడాది వలన హెలికాప్టర్ ఫ్లయింగ్, పారా మోటరింగ్, పారా గ్లైండింగ్ మాడగడ కొండపై ఉంటాయని కలెక్టర్ తెలిపారు.
ఇవి కాక నార్త్ ఈస్ట్రన్ స్టేట్స్, ఒడిషా, జార్ఖండ్, తమిళనాడు,మధ్యప్రదేశ్,తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుండి వచ్చిన వివిధ తెగల గిరిజనుల నృత్య ప్రదర్శనలతో, సాంస్కృతిక కార్యక్రమాలలో అరకులో ఉంటారని కలెక్టర్ అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


