ఖమ్మం జిల్లా : జనవరి 20 : (త్రినేత్రం న్యూస్); సత్తుపల్లి నియోజకవర్గం, కల్లూరు మండలం, లో గల గ్రామపంచాయతీలు పెద్ద కోరుకొండ, తెలగవరం, ఆ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లు దేవరపు. నాగమణి, యల్లమందల. విజయలక్ష్మి, అదేవిధంగా చిన్న కోరుకొండ ఉపసర్పంచ్ రెడ్డి .సుబ్బారావు మాట్లాడుతూ వాళ్లకు ఎంత మెజార్టీ వచ్చిందో , ఎన్ని వార్డులు సపోర్ట్ చేశాయో, గెలిచారో వివరించి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. మా గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించినందుకు అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. మేము, ఉప సర్పంచ్ లు గ్రామ వార్డులు అందరం కలిసి గ్రామ అభివృద్ధికి , ప్రజాసేవకు కృషి చేస్తామని అన్నారు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పరిష్కార దిశగా ముందుంటామని సూచించారు. ఎల్లవేళలా మా గ్రామ ప్రజలకు, అభివృద్ధికి ఇష్టంతో పనిచేస్తామని తెలిపారు.
తెలగవరం గ్రామ కార్యదర్శి బి. వినయ్ కుమార్ కూడా మాట్లాడుతూ సర్పంచ్, పాలకవర్గంతో గ్రామ అభివృద్ధికి , ప్రజా సేవకు ఎల్లవేళలా ప్రభుత్వ సమయం అనుగుణంగా పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆ గ్రామంలో పింఛన్ లు ఇస్తున్నారో, అభివృద్ధి ఎలా ఉందో వివరించి చెప్పారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


