TRINETHRAM NEWS

దిల్లీ: గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (2024) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి , మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తో పాటు ఐదుగురిని కేంద్రం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఈ ఏడాది మొత్తం 132 మందికి ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించగా.. ఐదుగురికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌, 110 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి.