Goods Train Derails : కావలి వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

TRINETHRAM NEWS

నెల్లూరు: కావలి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ నుంచి రేణిగుంటకు వెళ్తున్న గూడ్స్ రైలు కావలి దగ్గర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రైలు లోని రెండు బోగీలు పట్టాలు తప్పాయి.
ప్రమాదంతో ట్రాక్ తీవ్రంగా దెబ్బతినగా, పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. రాకపోకలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Goods train derails near Kavali

You cannot copy content of this page

Scroll to Top