Kukatpally News : పీజేఆర్ పేదల, కార్మికుల పక్షపాతి కర్క పెంటయ్య

TRINETHRAM NEWS

కూకట్పల్లి జనవరి 12 (త్రినేత్రం న్యూస్) : పీజేఆర్ ఫౌండేషన్ కూకట్పల్లి నియోజకవర్గం అధ్యక్షులు కర్కనాగరాజ్ ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ కార్మిక శాఖ మంత్రి పి.జనార్దనరెడ్డి 78వ జన్మదినోత్సవాన్ని మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్ లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కూకట్పల్లి పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కర్క పెంటయ్య విచ్చేసి పీజేఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన, అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజలకు పీజేఆర్ చేసిన సేవలను నెమరేసుకున్నారు.

బడుగు బలహీన వర్గాల నేత గా కార్మికుల పక్షపాతి గా స్వపక్షామైన విపక్షామైన నిరంతరం ప్రభుత్వాలతో పోరాటం చేసిన గొప్ప నేతగా చరిత్ర లో నిలిచారని వారు పేర్కొన్నారు.1994 లో ప్రతిపక్ష నాయకుడి గా కేవలం 26 మంది ఎ మ్మెల్యేలతో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల పై నిరంతరం పోరాటం చేసి పేద ప్రజల సమస్యల పరిష్కారానికై తనవంతు కృషి చేసారని వారు తెలిపారు.610 జి. ఒ, పోతిరెడ్డి పాడు, ఆల్మట్టి డామ్, పెద్ద మనుషుల ఒప్పందం, హైదరాబాద్ నగరానికి కృష్ణా, గోదావరి జలాలు, మరియు ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు కోసం పోరాటం చేసిన గొప్ప నాయకుడు పిజె ఆర్ అని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అమరజ్యోతి అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కర్క శివశంకర్,అసోసియేషన్ అధ్యక్షులు కర్క నిఖిల్, యూత్ కాంగ్రెస్ నాయకులు రాచమళ్ళ శేఖర్ గౌడ్,బీసీ వికాస సమితి అధ్యక్షులు భాశెట్టి నర్సింగ్ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్క నర్సింగరావు, గురజాల రాజు,ఐసీడి కంటైనర్స్ యూనియన్ నాయకులు జగన్, పాషా, కృష్ణయ్య, కర్కా పీజేఆర్ ఫౌండేషన్ కూకట్పల్లి నియోజకవర్గం అధ్యక్షులు కర్కనాగరాజ్ ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ కార్మిక శాఖ మంత్రి పి.జనార్దనరెడ్డి 78వ జన్మదినోత్సవాన్ని కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ అంబేద్కర్ నగర్ పరిధిలో ని గూడ్స్ షెడ్ రోడ్ లో ఘనంగా నిర్వహించారు.

ముఖ్య అతిధిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కూకట్పల్లి పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కర్క పెంటయ్య విచ్చేసి పీజేఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజలకు పీజేఆర్ చేసిన సేవలను నెమరేసుకున్నారు. బడుగు బలహీన వర్గాల నేత గా కార్మికుల పక్షపాతి గా స్వపక్షామైన విపక్షామైన నిరంతరం ప్రభుత్వాలతో పోరాటం చేసిన గొప్ప నేతగా చరిత్ర లో నిలిచారని వారు పేర్కొన్నారు.

1994 లో ప్రతిపక్ష నాయకుడి గా కేవలం 26 మంది ఎమ్మెల్యేల తో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల పై నిరంతరం పోరాటం చేసి పేద ప్రజల సమస్యల పరిష్కారానికై తనవంతు కృషి చేసారని వారు తెలిపారు.610 జి. ఒ, పోతిరెడ్డి పాడు, ఆల్మట్టి డామ్,ముల్కి నిబంధనలు,పెద్ద మనుషుల ఒప్పందం,ఏలేరు స్కాం పై జ్యూడిషల్ కమిటీ, హైదరాబాద్ నగరానికి కృష్ణా, గోదావరి జలాలు,మరియు ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు కోసం పోరాటం చేసిన గొప్ప నాయకుడు పిజెఆర్ అని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అమరజ్యోతి అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కర్క శివశంకర్,అసోసియేషన్ అధ్యక్షులు కర్క నిఖిల్, యూత్ కాంగ్రెస్ నాయకులు రాచమళ్ళ శేఖర్ గౌడ్,బీసీ వికాస సమితి అధ్యక్షులు భాశెట్టి నర్సింగ్ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్క నర్సింగరావు, గురజాల రాజు,వెంకట్,ఐసీడి కంటైనర్స్ యూనియన్ నాయకులు జగన్, పాషా, కృష్ణయ్య,కర్క ప్రేంకుమార్, పెరుమాండ్ల టీంకు,కర్కమహేష్,రమేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

PJR is a partisan of the poor and workers, Karka Pentayya

You cannot copy content of this page

Scroll to Top