Blood Donation Camp : ఆర్. ఎస్ .ఆర్ లో మెగా రక్తదాన శిబిరం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :జనవరి 7: నెల్లూరు జిల్లా :బోగోలు మండలం.. బోగోలు మండలం: కడనూతల గ్రామంలో గల రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఫౌండర్ పరిపాలన అధికారి అయిన రామిరెడ్డి సుబ్బా రెడ్డి జ్ఞాపకార్థం ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో సోమవారం మెగా రక్తదాన శిబిరం జరిగినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివిఎన్ రెడ్డి తెలిపారు.

వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు జరిగిన రక్తదాన శిబిరంలో 45 యూనిట్లు రక్తమును దానం చేసినట్లు తెలిపారు. ఇంకా వారు మాట్లాడుతూ ఈరోజు జరిగిన క్యాంప్ 48 వ క్యాంపు అని, ఇప్పటివరకు కళాశాల విద్యార్థిని విద్యార్థులు 2417 యూనిట్ల రక్తమును దానం చేసినట్లు తెలిపారు. రక్తదానం ప్రాణదానం కన్నా మిన్నని ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకున్న వాళ్ళవుతారని తెలిపారు.

ఈ శిబిరం కావలి ఏపీవీవీపి ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వారి సహాయంతో జరిగినట్లు తెలిపారు. ఈ శిబిరంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఆర్ వి రమణారెడ్డి, అన్ని విభాగాలు అధిపతులు, అధ్యాపకులు, ఎన్.ఎస్.ఎస్, విద్యార్థులతొ పాటు బీటెక్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mega Blood Donation Camp in R. S. R.

You cannot copy content of this page

Scroll to Top