18 నెలల కూటమి పరిపాలనలో 18 గంటలు మాత్రమే కాకినాడ జిల్లాలో ఉన్న మంత్రి పవన్ కళ్యాణ్…
కాకినాడ మున్సిపల్ కమిషనర్లుగా ఐఏఎస్ లు పనికిరారా..?
ఓఎన్జిసి నిర్లక్ష్యం వల్లే బ్లో అవుట్ ప్రమాదాలు….
జనవరి 18న చలో ఖమ్మం ను జయప్రదం చేయండి….
కాకినాడ ప్రెస్ మీట్ లో
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు తాటిపాక మధు
త్రినేత్రం న్యూస్, కాకినాడ, జనవరి 06: సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు పిబ్రవరి 16 17 18 తేదీలలో కాకినాడ లో జరుగుతున్నాయని ఈ సమితి సమావేశాలకు చాలా ప్రాధాన్యత ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు
మంగళవారం ఉదయం స్థానిక పొన్నమండ రామచంద్ర రావు భవన్ లో సీపీఐ పాత్రికేయుల సమావేశం లో మధు మాట్లాడారు..
ఆయన కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కాలంలో పిఠాపురం నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేవలం 18 గంటలు మాత్రమే గడపడం జరిగిందిని అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాన్య ప్రజలు కలవాలంటే ఇబ్బందులు పడవలసిన పరిస్థితి నెలకొందిని పోలీస్ బందోబస్తు మధ్య పవన్ కళ్యాణ్ పర్యటన సాగుతుందిని అన్నారు
కాకినాడ జిల్లా అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ ముద్ర కనిపించడం లేదని కాకినాడ రూరల్ పర్యాటక కేంద్రంగా తయారు చేస్తారని గత ఎన్నికలలో హామీ ఇవ్వడం జరిగిందిని కనీసం అక్కడ అభివృద్ధి కూడా చేయకపోవడం దురదృష్టకరంని మధు అన్నారు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కాకినాడ పోర్ట్ లో కార్మికుల ఉపాధి కోల్పోయారు.
రేషన్ బియ్యాన్ని పట్టుకొని సీజ్ ద షిప్ అన్న పవన్ కళ్యాణ్ మాటలతో కాకినాడ పోర్టుపై దొంగల పోర్ట్ గా ముద్ర పడింది. 30 సంవత్సరాల కిందట కాకినాడ పోర్టుపై నిషేధ విధించారు. తిరిగి ప్రభుత్వంలో,ఎగుమతులు దిగుమతులు, లేక ఉన్న పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొందిని పేర్కొన్నారు కాకినాడ జిల్లాలో ఉన్న యువత ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని వేరే ప్రాంతాలకు వలసలు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాకినాడ నగరం, కీలకమైనదని అలాంటి నగరానికి ఐఏఎస్ అధికారిని నియమించకుండా ఎంపీ సాన సతీశ్ తన మాట వినేవిధంగా డమ్మీ అధికారులను నియమిస్తున్నారని ఆయన ఆరోపించారు పక్కన రాజమండ్రి కి ఐఏఎస్ వేసి కాకినాడ లో మాత్రం తప్పు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు
అమెరికా తన సామ్రాజ్యవాద అహంకారంతో చిన్న చిన్న దేశాలపై ఆర్థిక, సైనిక, వైమానిక దాడులకు పాల్పడుతూ ప్రపంచ శాంతికి ముప్పుగా మారిందన్నారు.
వివిధ అంతర్జాతీయ సమస్యలను సాకుగా చూపుతూ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో, ఆయన భార్య సిలియో ఫ్లోర్స్ ను అరెస్టు చేసి నిర్బంధించడం ఒక స్వతంత్ర దేశాధ్యక్షుడిపై చేసిన ఘోర దాడిగా అభివర్ణించారు. ఇది అంతర్జాతీయ చట్టాలకు, ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధమని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా చిన్నా-పెద్దా అన్ని దేశాలు ట్రంప్ యొక్క ఈ ఘాతుక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికీ స్పందించకపోవడం అత్యంత దుర్మార్గమైన వైఖరని విమర్శించారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ ట్రంప్ విధానాలను ఖండించి, అమెరికా సామ్రాజ్యవాద దౌర్జన్యానికి వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు
సీపీఐ వందేళ్ళ పాటు దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల కోసం
సీపీఐ చారిత్రక పోరాటాలు చేపట్టింది అని అన్నారు ఈ శత జయంతి ముగింపు సందర్భంగా జనవరి 18 న ఖమ్మం లో లక్షలాది మంది తో బహిరంగ సభ జరగనుందని మధు తెలిపారు ఈ సభకు అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని మధు పిలుపునిచ్చారు
ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కె బోడకొండ సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, సాక రామకృష్ణ, టీ అన్నవరం, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


