గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేతావత్ బాబురాం నాయక్.
దేవరకొండ డివిజన్ జనవరి 04 త్రినేత్రం న్యూస్. రంగారెడ్డి జిల్లాను విభజించి రెండుగా చేయాలంటూ ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో, ముందుగా మారుమూల గిరిజన ప్రాంతమైన దేవరకొండను జిల్లాగా ప్రకటించాలని గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేతావత్ బాబురాం నాయక్ డిమాండ్ చేశారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన జిల్లాలను విభజించడంకన్నా, తీవ్ర వెనుకబాటుతనంతో ఉన్న దేవరకొండకు జిల్లా హోదా ఇవ్వడం సామాజిక న్యాయానికి నిదర్శనమవుతుందని ఆయన అన్నారు.
శనివారం దేవరకొండలో నిర్వహించిన పత్రికా సమావేశంలో బాబురాం నాయక్ మాట్లాడుతూ, దేవరకొండ ప్రాంతం చారిత్రకంగా, భౌగోళికంగా, సాంస్కృతికంగా అత్యంత ప్రాధాన్యం కలిగినదైనా, ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు ఇప్పటికీ ఈ ప్రాంతానికి పూర్తిగా చేరలేదని విమర్శించారు. పద్మరాజుల పాలనలో దేవరకొండ ఖిల్లా పరిపాలనా, సైనిక కేంద్రంగా ఉన్నదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నంలో ఉన్న పూర్ణకుంభం కూడా దేవరకొండ ఖిల్లా నుంచే తీసుకెళ్లబడిందని చారిత్రక వాస్తవాలను గుర్తు చేశారు.
ఆడపిల్లల విద్య మరియు భద్రత సమస్యలు, గిరిజన గ్రామాల్లో త్రాగునీరు, రవాణా, ఉపాధి, నివాస వసతుల కొరత తీవ్రంగా ఉన్నాయని తెలియ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


