Artist’s Death : కళాకారిణి దుర్మరణం

TRINETHRAM NEWS

తేదీ : 26/12/2025. కోనసీమ జిల్లా : (త్రినేత్రం న్యూస్): రాజోలు మండలం , శివకోటిలో విషాదం చోటుచేసుకుంది. తీర్థ మహోత్సవాల్లో నాట్య ప్రదర్శన ఇచ్చేందుకు , రాజమహేంద్రవరం నుండి వచ్చిన కళాకారిణి పాలపర్తి. భవ్య శ్రీ(పదిహేడు) ప్రమాదవశాత్తు భవనం పైనుంచి జారిపడి మృతి చెందింది.

ఆమె ఎత్తయిన పాదరక్షలు ధరించడం వల్ల , మెట్లకు రక్షణ గోడలు లేకపోవడంతో అదుపుతప్పి కింద పడింది. తలకు తీవ్రమైన గాయం పడడంతో వైద్యశాలకు తరలించే లోపే మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. ఆ మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Artist's death

You cannot copy content of this page

Scroll to Top