Sarpanch Sravanti-Sudhakar : ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి అభివృద్ధి పనులు ప్రారంభించిన సర్పంచ్ గాదే స్రవంతి-సుధాకర్

TRINETHRAM NEWS

అకెనపల్లి గ్రామం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అంతర్గాం మండలం రామగుండం నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా బుధవారం రోజున రామగుండం శాసనసభ్యులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆకెనపల్లి గ్రామ సర్పంచ్ గాదె స్రవంతి సుధాకర్ అకెనపల్లి గ్రామ సర్పంచ్ గా *ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుండే గ్రామ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా పాలనలో భాగంగా ఆకెనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన పిలకాని భాగ్య -స్వామి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించిన స్లాబ్ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడం జరిగినది.

అనంతరం సర్పంచ్ గాదె స్రవంతి సుధాకర్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో 182 ఓట్ల భారీ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించిన నా ఆకెనపల్లి గ్రామ ప్రజల ఆశీర్వాదాలతో గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకారంతో గ్రామాన్ని *అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దుతానని నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజానీకానికి రుణపడి ఉంటానని మాట్లాడడం జరిగినది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sarpanch Sravanti-Sudhakar started

You cannot copy content of this page

Scroll to Top