నాభిశిల (బొడ్డురాయి) ఘనంగా బోనాలు….
బిజెపి సీనియర్ నాయకులు కంచి మహేందర్
కూకట్ పల్లి డిసెంబర్ 23 (త్రినేత్రం న్యూస్) : కూకట్ పల్లి నియోజకవర్గం మూసా పేట సర్కిల్ ఫతేనగర్ డివిజన్ పరిధిలోని పోచమ్మ దేవాలయంలో 22న సోమవారం మరియు 23న మంగళవారం రెండు రోజుల పాటు అమ్మవారి 28వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా బొడ్డురాయి బోనాలు నిర్వహిస్తు నిర్వహకులు తెలిపారు.
ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకం, అలంకార, కుంకుమ అర్చన , హారతి , తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా మంగళవారం దుర్గా హోమం, సువాసిని పూజ , లలితా సహస్ర నామ పారాయణ , సామూహిక కుంకుమార్చన జరుగును. మధ్యాహ్నం 12:30 కు అన్న ప్రసాద వితరణగావించారు. అనంతరం బొడ్డురాయి, బోనాలు జరిగాయి.
ఈ నేపథ్యంలో ఫతేనగర్ డివిజన్ ప్రజలు భక్తులు అందరరు పూజలలో అధిక సంఖ్య లో పాల్గొని అమ్మవారి కృప కు పాత్రులు కాగలరని స్థానిక నాయకుడు కంచి మహేందర్ కోరారు.ఈ కార్యక్రమంలో కంచి స్వామి, కంచి పాండు మహేష్, కంచి దినేష్, కంచి ప్రశాంత్, మింటు, శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


