వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మోమిన్ కలాన్ గ్రామ నూతన సర్పంచ్‌గా నస్కాంటి మాధవి బాలరాజ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, గ్రామ అభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.
ముఖ్యంగా సిసి రోడ్ల నిర్మాణం, మురుగునీటి కాలువల శుభ్రత మరియు తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమెను ఘనంగా సన్మానించరు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


