MLA Kavya Krishna Reddy : బి.పి.ఎస్, షాపింగ్ ను నూతనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 22: నెల్లూరు జిల్లా :కావలి … కావలి పట్టణంలో అతి పెద్ద ఐస్‌క్రీమ్, స్వీట్స్,బేకరీని నూతన భవనంలో రూపొందించిన బి .పి .ఎస్ .ను పున ప్రారంభించిన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదగా సోమవారం ఘనంగా ప్రారంభించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బెజవాడ ప్రకాష్ రావు దంపతులు,పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు
అనంతరం ఎమ్మెల్యే పూజా కార్యక్రమంలో పాల్గొని,వ్యాపారం సక్రమంగా అభివృద్ధి చెందాలని, సంస్థ మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కావలి ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించేలా ఇలాంటి వ్యాపార సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. నాణ్యత, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని బెజవాడ ప్రకాష్ రావు దంపతులకు సూచించారు
అనంతరం బెజవాడ ప్రకాషరావు దంపతులను ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బి .పి .ఎస్ ,ద్వారా కావలి పట్టణ ప్రజలకు క్వాలిటీ ఐటమ్స్ స్వీట్స్,బేకరీని అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు.కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నిర్వాహకులు ఘనంగాసన్మానించారు
ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు,వ్యాపారవేత్తలు,అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Kavya Krishna Reddy launches new shopping

You cannot copy content of this page

Scroll to Top