CPI Felicitate Macharla Jyoti : ధర్మసాగర్ నూతన సర్పంచ్ మాచర్ల జ్యోతికి సిపిఐ శ్రేణుల ఘన సత్కారం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 22 ధర్మసాగర్: హన్మకొండ జిల్లా ధర్మసాగర్ ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, హన్మకొండ జిల్లా ధర్మసాగర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మాచర్ల జ్యోతిని సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు సోమవారం ధర్మసాగర్ గ్రామంలో మాచర్ల జ్యోతి నివాసం లో సిపిఐ శ్రేణులు ఆమెకు శాలువా కప్ప పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గ్రామాభివృద్ధిలో సర్పంచ్ మాచర్ల జ్యోతి చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించార రాబోయే రోజుల్లో ధర్మసాగర్ గ్రామ రూపురేఖలు మార్చడంలో ఆమె విజయం సాధించాలని కోరారు
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కొట్టె లింగయ్య, సింగరపు కొమ్మురయ్య వల్లెపు సారయ్య బండి రాత్తమ్మ మరియు పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CPI ranks felicitate new Sarpanch of Dharmasagar, Macharla Jyoti

You cannot copy content of this page

Scroll to Top