Dr. Satthi : కైకవోలు గ్రామ వైయస్‌ఆర్‌సీపీ కన్వీనర్‌గా సత్తిబాబు నియామకం

TRINETHRAM NEWS

అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ని మర్యాదపూర్వకంగా కలిసిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులు

త్రినేత్రం న్యూస్… పెదపూడి మండలం కైకవోలు గ్రామ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్‌గా నీలం వీర వెంకట సత్యనారాయణ (సత్తిబాబు), నియామకాన్ని పురస్కరించుకుని, గ్రామం మరియు మండలానికి చెందిన పార్టీ నాయకులు అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ని ఈరోజు (20.12.2025) ఉదయం గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని, గ్రామస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండాలని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, వారికి సూచించారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో అమలైన సంక్షేమ పథకాలను, చేసిన అభివృద్ధిని ప్రజలకు మరింత విస్తృతంగా చేరవేయాలని, పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయిలో బలంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పెదపూడి మండల వైయస్‌ఆర్‌సీపీ కన్వీనర్ గుత్తుల రమణ, అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సాంబత్తుల చంటి, మండల కార్యదర్శి దాట్ల శివాజీ రాజు, పంచాయతీ విభాగ కార్యదర్శి నూనె రామచంద్రరావు, ఉప సర్పంచ్ కొప్పిశెట్టి వీరశంకర్, ఎంపీటీసీ సభ్యులు తిమ్మరాజు రాజు, మండల యువజన విభాగం సంయుక్త కార్యదర్శి ఎల్లె సాగర్, గ్రామ ఎస్సీ సెల్ కన్వీనర్ సాంబత్తుల సురేష్, మండల వాణిజ్య కార్యదర్శి చుక్కా వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ కార్యదర్శి పెరుగుల మహేంద్ర, ముప్పిడి సుదర్శన్ రావు, పట్టా శ్రీను, కుడుపూడి వెంకన్న బాబు, సాంబత్తుల వీరబాబు తదితర వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Satthibabu appointed as YSRCP convener of Kaikavolu village

You cannot copy content of this page

Scroll to Top