Father Files Case : కూతురు కనిపించలేదు కేసు పెట్టిన తండ్రి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండలం గుడ్ యానం పల్లి పంచాయతీ కండిగ గ్రామానికి చెందిన డిషిత అనే అమ్మాయి పెనుమూరులో తిరుమల ఆదర్శ కాలేజీలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతోంది. వయసు 16 సంవత్సరాలు. ఈ అమ్మాయి నిన్న అనగా బుధవారం 17 /12 /25 ఉదయం 9 గంటల ఇంటి నుంచి బయలుదేరి కాలేజీకి వచ్చింది. కానీ తర్వాత సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వెళ్లలేదు.

ఇంట్లోని వాళ్లంతా ఆమె ఇంటికి రాలేదని.. ఫ్రెండ్స్ ని బంధువులని విచారించారు. కానీ తన కూతురు జాడ తెలియలేదని తండ్రి వేణుగోపాల్ రెడ్డి ఈరోజు 18/ 12 /25 గురువారం పెనుమూరు పోలీస్ స్టేషన్ లో తన కూతురు కనిపించలేదని ఎవరో కిడ్నాప్ చేశారని కేసు నమోదు చేయాలని ఎస్సై వెంకట నరసింహను కోరారు. ఎస్ ఐ వెంకట నరసింహ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Father files case after daughter goes missing

You cannot copy content of this page

Scroll to Top