త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 18: నెల్లూరు జిల్లా : కడనూతుల.. బోగోలు మండలం: కడనూతుల గ్రామంలో గల రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం నాడు ఫ్రెషర్స్ డే , 2కె25 ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివిఎన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమములో ప్రముఖ యాంకర్ శ్రావణి నిర్వహణలో ప్రముఖ హీరోయిన్ మెహరీన్ మరియు డాన్స్ మాస్టర్ పండు పాల్గొని బీటెక్ విద్యార్థినీ విద్యార్థులను ఉల్లాసంగా, ఉత్సాహంగా, ప్రోత్సహించారని, ఆనందపరచారని తెలిపారు. హీరోయిన్ మెహరీన్ మాట్లాడుతూ విద్యార్థులను ఉత్సాహపరుస్తూ మీకు ఏ యాక్టివిటీ ఇష్టమో దానిమీద పూర్తిగా కేంద్రీకరించి ప్రావీ ణ్యము సంపాదించి అభివృద్ధి చెందాలని కోరారు.
అలాగే కొన్ని పాటలు డాన్సులతో విద్యార్థిని విద్యార్థులను ఉత్సాహపరిచారు. డాన్స్ మాస్టర్ పండు డాన్సర్ తో మరియు విద్యార్థిని విద్యార్థులతో కలిసి డ్యాన్సులు వేసి విద్యార్థిని విద్యార్థులను ఒత్తిడి నుండి బయటకు తీసుకొచ్చి ఫ్రెష్ అప్ చేసినట్లు మరియు వాళ్లను ఆనందింపజేసినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ , ఇంకా మాట్లాడుతూ ఈ కార్యక్రమం వల్ల పిల్లల్లో ఉన్నటువంటి మానసిక ఒత్తిడి తొలగిపోయి నూతన ఉత్సాహంతో ఎగ్జామ్స్ అప్పిరు కావడానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ వి రమణారెడ్డి అన్ని విభాగాల ఆధిపతులు అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


