Drone Services : మన్యంలో వైద్య సేవలకు నూతన రెక్కలు – డ్రోన్ సేవలు

TRINETHRAM NEWS

అరకులోయ డిసెంబర్ 19, (త్రినేత్రం న్యూస్): మారుమూల గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు మరింత సత్వరంగా అందించేందుకు డ్రోన్ వైద్య సేవల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. రెడ్ వింగ్ సంస్థ – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఉమ్మడి విశాఖ మన్యంలో ఈ వినూత్న వైద్య సేవలను ప్రారంభించాయి. ఈ పథకం కింద మొత్తం ఎనిమిది కేంద్రాల నుంచి డ్రోన్ వైద్య సేవలు అందించనుండగా, ప్రస్తుతం పాడేరు, అరకు, చింతపల్లి, ముంచింగ్‌పుట్ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించారు. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్‌లో విజయవంతంగా అమలు చేసిన ఈ డ్రోన్ సేవలను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థన మేరకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం అరకు కేంద్రం నుంచి రెండు డ్రోన్లను వినియోగిస్తూ, మారుమూల గ్రామాలకు అవసరమైన మందులు, వైద్య సామగ్రిని సరఫరా చేస్తున్నారు.
ఈ డ్రోన్లు 100 కిలోమీటర్ల పరిధిలో 1 నుంచి 3 కిలోల బరువు వరకు వైద్య వస్తువులను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉన్నాయని తెలిపారు. దీని ద్వారా రహదారి సదుపాయాలు లేని గిరిజన గ్రామాలకు కూడా సకాలంలో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని నిర్వాహకులు వెల్లడించారు. ఈ డ్రోన్ వైద్య సేవల పథకంపై గిరిజన ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New wings for medical services in Manyam

You cannot copy content of this page

Scroll to Top